8 April, 2026 | 4:21 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

తెలంగాణను రక్షించుకోవాలి

16-02-2026 01:19 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకం

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఢిల్లీ బాబుల చేతుల నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు.  ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు.  మున్సిపల్, హోం, విద్యా శాఖల వంటి కీలక శాఖలను సీఎం రేవంత్‌రెడ్డి తన వద్దే పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని  విమర్శించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 30 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉండటంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, రేవంత్ రెడ్డి దగ్గర హోం శాఖ ఎందుకు వుందో అర్థం అవుతోందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఎవరు ఉల్లఘించినా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వా లని, వికారాబాద్ సభలో సీఎం హస్తం గు ర్తుకు ఓటు వేయాలని చెప్పినా రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు.

ఎన్నికల రోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులను బూతులు తిట్టారని చెప్పారు.  దశాబ్దాలుగా హోంగార్డులుగా సేవలు అందిస్తున్న వారిని జగ్గారెడ్డి పచ్చి బూతులు తిట్టారని తెలిపారు. ఫార్ములా ఈవైకార్ రేస్‌పై మళ్లీ లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చేర్యాలలో భార్య బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేస్తే భర్తను సస్పెండ్ చేశారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల కుటుంబీకులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని.. వారిని ఏమైనా బీఆర్‌ఎస్ హయాంలో సస్పెండ్ చేశారా అని ప్రశ్నించారు. కాగజ్ నగర్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్ ఓటు వేయకపోయినా అతనికి అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని ఆరోపించారు. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.