calender_icon.png 16 February, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెండా మోసినోళ్లకే చైర్మన్ పదవి?

16-02-2026 01:20:23 AM

  1. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి సవాంగ్ చర్చలు
  2. ఇరువురితో ఫోన్‌లో మాట్లాడిన మీనాక్షినటరాజన్ 
  3. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచన 
  4. సరేనన్న జీవన్‌రెడ్డి, సంజయ్ ముగిసిన జగిత్యాల పంచాయితీ!

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): గత కొద్ది రోజులుగా కొనసాగు తున్న జగిత్యాల కాంగ్రెస్ అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్టు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికలతో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య  మరింత వేడెక్కిన పంచాయితీకి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పడింది. కాంగ్రెస్ అధి ష్ఠానం పార్టీ జెండా మోసిన వారికే చైర్మ న్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

అధిష్ఠానం ఆదేశాల మేరకు ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రంగంలోకి దిగి ఇరువర్గాల నేతలతో ఆదివారం ప్రజా భవన్‌లో సమావేశమై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ కూడా ఇరువురితో ఫోన్‌లో మాట్లాడారు. సవాంత్ ముందుగా ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డితో వేర్వేరుగా సమా వేశమై అభిప్రాయాలు సేకరించగా, ఆ తర్వాత ఇద్దరితో కలిసి చర్చలు జరిపారు.

పార్టీ అంతర్గత విషయాలు రోడ్డు పైకి తీసుకురావడం వల్ల కేడర్‌లో ఆయోమయం నెలకొంటుందని సవాంత్ హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీకి క్రమశిక్షణే ముఖ్యమని, పార్టీ తీసుకునే తుది నిర్ణయానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉండాలని సవాంగ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి, జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు, పాతతరం నాయకులకే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ వంటి కీలక పదవులు ఇవ్వాలని జీవన్‌రెడ్డి సూచించగా, అందుకు పార్టీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే కూడా అంగీక రించినట్లు తెలుస్తోంది. 

రెండు ప్రతిపాదనలు

జగిత్యాల నాయకుల ముందు ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ సవాంగ్ రెండు ప్రతిపాదనలు ఉంచారు. మొదటిది ఎమ్మెల్యే సంజ య్ వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్ పదవి జీవన్‌రెడ్డి వర్గానికి, రెండో ప్రతిపాదనగా చెరో రెండున్నరేళ్లు చైర్మన్ పీఠం పంచుకునేలా ఇరువర్గాలకు సూచించినట్లు సమాచారం. జీవన్‌రెడ్డి మాత్రం పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం ఇవ్వాలని కోరారు.

సమావేశం అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ జెండా మోసిన వారికే పదవులు ఇవ్వాలని కోరుకునే వ్యక్తి ని.. నా అభిప్రాయాలు , సూచనలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పాను’ అని తెలిపా రు.

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కౌన్సిలర్లుగా గెలుపొందిన సమిం డ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్ పర్స న్ అభ్యర్థిగా ప్రతిపాదంచానని, వీరిద్దరికి కా ంగ్రెస్ పార్టీతో పని చేసిన అనుబంధం ఉన్నదని, ఇద్దరు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డలని చెప్పారు.