13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

కాంగ్రెస్ అరాచకాలు ప్రజాస్వామ్య విరుద్ధం

12-02-2026 02:52 AM
  1. ఎన్నికల్లో గెలుపు కోసం నీచ రాజకీయాలు
  2. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి11 (విజయక్రాంతి): నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీమంత్రి హరీశ్‌రావు మండి పడ్డారు. సీఎం మొదలుకొని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.

బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతికదాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని, చట్టాన్ని సైతం లెక్కచేయకుండా అధికార పార్టీ నాయకుల అడుగుల కు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవని హితవు పలికారు. అధికార పార్టీ అకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జీలను అభినందించారు. బీఆర్ ఎస్‌పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకూ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.