calender_icon.png 14 February, 2026 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మంలో కాంగ్రెస్ హవా

14-02-2026 12:47:07 AM

  1. ఐదు మున్సిపాలిటీలో జెండా ఎగరవేసిన హస్తం పార్టీ

మధిరలో ఏకపక్షం.. 

మొత్తం 21 స్థానాల్లో 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

ఖాతా తెరవని బీజేపీ

ఖమ్మం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): అభివృద్ధి పథకాలు పనిచేశాయా? లేక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కు పట్టం కడితే ఒరిగేదేమీ లేదు అనుకున్నారా? తెలియదు గాని ఖ మ్మం మున్సిపల్ ఓటర్లు అధికార పార్టీకి గంపగుత్తగా ఓట్లు వేశారు. దీంతో ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి శుక్రవారం వెలువడ్డ ఫలితాలో కాం గ్రెస్ జెండా రెపరెపలాడింది. ప్రతిపక్ష టిఆర్‌ఎస్ పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఇక ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు వెలుగు వెలిగిన వామపక్షాలైన సిపిఐ సిపిఎంలు ఏదో పోటీలో ఉన్నామంటేగా నవమాత్రం శీలం గెలిచారు.

జాతీయ పార్టీ అయిన బిజెపి ఆయన మున్సిపాలిటీలో కనీసం ఒక్క వా ర్డును కూడా గెలుచుకోలేకపోయింది. సిపిఐ సిపిఎం బిజెపి కంటే స్వతంత్ర అభ్యర్థులు నయమనిపించారు. ఆయా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఆరుగురు స్వతంత్ర అభ్య ర్థులు తమ సత్తా చాటారు. మొత్తంగా ము న్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత అని కాంగ్రెస్ ఎద్దేవా చేసిన మిగతా పార్టీలను చతికిలబడిపోగా, అధికారహస్తం పార్టీ తమ రెండేళ్ల పాలనలో ప్రజలు అన్ని రకాల పథకాలను అందటంతోనే తమకు విజయం కట్ట బెట్టారని, అందుకు ఈ ఎన్నికల విజయమే నిదర్శనమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

117లో 83 కాంగ్రెస్ కు.. 21 బీఆర్‌ఎస్ కు..

ఖమ్మం జిల్లాలోని ఏదూలపురం మున్సిపాలిటీలో 32 వార్డులు, వైరా 23, సత్తుపల్లి 23, కల్లూరు 20, మధిరలో 22, మొత్తం 117 వార్డులకు ఈనెల 11న జరిగిన ఎన్నికల జరిగాయి. వీటిల్లో ఎదులాపురం లోని 24 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఇందులో 15వ వార్డు ఏకగ్రీవంగా ఎన్నికయింది. వైరా మున్సిపాలిటీలో 12 వార్డులను, సత్తుపల్లి 17, కల్లూరు 12, మధిర 18 వార్డులను మొత్తం మీద 83 వార్డులను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇక బిఆర్‌ఎస్ అన్ని మునిసిపాలిటీల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. మరీ ముఖ్యంగా మధిరలో ఒక్క స్థానం, ఏదులాపురంలో రెండు స్థానాలను దక్కించుకుంది.

వైరాలో 5 స్థా నాలు చేజిక్కించుకోగా, సత్తుపల్లి లో 6, కల్లూరులో 7 స్థానాలను కైవసం చేసుకుని వరుస సంఖ్యలను తల తలపింపజేసింది. మొత్తం మీద ఆయా మున్సిపాలిటీలోని 117 వార్డులకు గాను 21 స్థానాలను కైవసం చేసుకోవటంతో, చావుతో తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మారింది బీఆర్‌ఎస్ పరిస్థితి. సిపిఎం మూడు స్థానాలకు పరిమితం కాగా, సిపిఐ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక బిజెపి ఏ ఒక్క వార్డులోనూ విజ యం సాధించలేక పరువు పోగొట్టుకుంది. 

అభివృద్ధి పథకాలే గెలిపించాయా.. 

ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ అభివృద్ధి పథకాలే అధికార పార్టీని గెలిపించాయా అంటే అవును అని గట్టిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈరోజుకి కూడా రైతన్నలకు ఎరువు వేతలు తప్పడం లేదు. అయినా కాంగ్రెస్కే ప్రజలు ఎందుకు పట్టం కట్టారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఆయా మున్సిపాలిటీలో పంచాయతీల్లో అధికార పార్టీ నుంచి ఎన్నికైన నాయకులు ఉంటేనే పనులు జరుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. 

అలాకాకుండా ప్రతిపక్ష పార్టీ, ఇతర పార్టీలకు పట్టం కడితే పనులు జరక్క నిజ రాక ఇబ్బంది పడే ఈ తామేనని పైగా అధికారంలో ఉన్న వారితో అనవసర తలనొప్పులు ఎందుకని భావించే ప్రజలు ఇలా గంపగుత్తగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికలు వాటి ఫలితాలు చూసి అంతా సవ్యంగానే సాగుతుందని అన్ని రకాల పథకాలు ప్రజలకు అందుతున్నాయని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదని అభిప్రాయానికి రాకూడదని కూడా చెబుతున్నారు. మొత్తానికి ప్రస్తుత ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపితే, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కు గట్టి షాక్ ని ఇచ్చాయని చెప్పవచ్చు.