calender_icon.png 6 December, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పూనెం కృష్ణ ఇంటింటా ప్రచారం

06-12-2025 10:07:27 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం గ్రామ పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భద్రాచలం కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న పూనెం కృష్ణ కోరారు. భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ ప్రాంతంలో విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా పూనెం కృష్ణ స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, వారి సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రాధాన్యత పొందాల్సిన అంశాలను తెలుసుకున్నారు.

గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, రహదారుల సవరణ, వెలుగుల సదుపాయాల బలోపేతం, ప్రజా సేవల మెరుగుదల వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా  జరిగిన సభలో పూణ్యం కృష్ణ మాట్లాడుతూ భద్రాచలం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే సిపిఐ మద్దతుతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ భద్రాచలంను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. తాము అధికరణం రాగానే భద్రాద్రి దేవాలయం అభివృద్ధికి 50 కోట్లు మంజూరు చేసామని అదేవిధంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కావున పట్టణ ప్రజలు కత్తెర గుర్తుపై ఒకే ఓటు… గ్రామ అభివృద్ధికి మీ మద్దతు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని  విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో వార్డుకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ నాయకులు, యువకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.