26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

డీఎంకేతో కాంగ్రెస్ దోస్తీ కట్

07-05-2026 12:50 AM
  1. టీవీకేకు మద్దతు ఇస్తామని అధిష్ఠానం స్పష్టీకరణ
  2. తమిళ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాలు

చెన్నై, మే ౬: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా డీఎంకేతో కొనసాగిస్తున్న బంధానికి కాంగ్రెస్ పార్టీ స్వస్తి పలికింది. టీవీకేకు తమ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పింది. తద్వారా విజయ్ ప్రభుత్వంలో భాగస్వామి కానుంది.

ఈ నిర్ణయంతో డీఎంకే, కాంగ్రెస్ మధ్య 20 ఏళ్ల మిత్రబంధం ముగిసిపోయింది. ద్రవిడ ఉద్యమ వెల్లువలో 1967లో అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలుపంచుకోవడం ఇదే మొదటిసారి. ఈ పొత్తు ప్రభుత్వం ఏర్పాటుకే కాదని, స్థానిక ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లోనూ టీవీకేతోనే కలిసి నడుస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ వెన్నుపోటుదారు: డీఎంకే

కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై డీఎంకే నేతలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తున్నారు. ఈ వాదనను కాంగ్రెస్ తిప్పికొట్టింది. 2013లో డీఎంకే కూడా యూపీఏ నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తోంది. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకే తాము టీవీకేతో జట్టు కడుతున్నామని స్పష్టం చేసింది.

రజనీకాంత్‌తో స్టాలిన్ భేటీ

తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం చెన్నైలోని సినీస్టార్ రజనీకాంత్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్టాలిన్ ఆయనతో భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి చర్చించుకుంటున్న ఫొ టో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర ల్ అవుతున్నది. రజనీకాంత్ గతంలో అనేకసార్లు డీఎంకేకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.