26 June, 2026 | 8:10 PM

కేరళం సీఎం ఎవరు?

07-05-2026 12:52 AM
  1. కాంగ్రెస్ శ్రేణుల్లో ఎడతెగని ఉత్కంఠ
  2. రేసులో ముగ్గురు నేతలు
  3. సోషల్ మీడియా వేదికగా వార్

కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించడంతో తదుపరి సీఎం ఎవరు అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా, సోషల్ మీడియాలో మద్దతుదారుల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతోంది.

త్రివేండ్రం, మే ౬: కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎఫ్ కూటమి ఘనవిజయం సాధించింది. కానీ, ఆ పార్టీ నుంచి సీఎంగా ఎవరు ఎంపిక అవుతారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిం ది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో విపక్ష నేత వీడీ సతీశన్,  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల ఉన్నారు. వీరిలో సీఎం ఎవరనే అంశం పై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే సోషల్ మీడియాలో అభిమానుల మధ్య సోషల్‌మీడి యా వేదికగా యుద్ధం జరుగుతోంది.

తాజా జాతీయ, రాజకీయ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజీని ఫాలో అవండి.

ఒక్కో నేత మద్దతుదారులు తమ నాయకుడే తదుపరి ముఖ్యమంత్రి కావాలని పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ తమకు అభిమాన నేతకు పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా అధిష్ఠానం మాత్రం సతీశన్, వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచా రం జరుగుతున్నది.

2026 అసెంబ్లీ ఎన్నికల పూర్తి విశ్లేషణ కోసం Election Results ప్రత్యేక కథనాలు చదవండి.

అయితే.. ఇద్దరూ దిగ్గజ నేతలే అయినప్పటికీ, ఇద్దరిలో ఎవరు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీనియర్ నేత రమేష్ చెన్నితాల కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. కానీ, సోషల్ మీడియా పోస్టులు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతాయని తాను నమ్మడం లేదని తేల్చిచెప్పారు. అధిష్ఠానం నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేశారు.


FAQ'S:

1. కేరళ సీఎం రేసులో ఎవరు ఉన్నారు?

వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

2. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని సీఎం చేయబోతోంది?

అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే సతీశన్, వేణుగోపాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

3. సోషల్ మీడియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?

ప్రతి నేతకు చెందిన మద్దతుదారులు తమ నాయకుడే సీఎం కావాలని పోస్టులు చేస్తుండటంతో చర్చ మరింత వేడెక్కింది.

4.రమేష్ చెన్నితాల ఏమన్నారు?

సోషల్ మీడియా పోస్టులతో సీఎం పదవి రాదని, హైకమాండ్ నిర్ణయమే కీలకమని చెప్పారు.