06-01-2026 12:00:00 AM
ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షుడు దేవి రవీందర్
గజ్వేల్, జనవరి 5 : మాజీ సీఎం కేసీఆర్ నివాసం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ప్ర యత్నమని మాజీ ఎంపిటిసిల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు, రైతుబంధు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యు లు దేవి రవీందర్, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండ మధులు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ గజ్వేల్కు ఏం చేశారనే విషయంపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులను అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటి ముందు ధర్నాలు చేస్తే కాదు, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులు చూపిస్తేనే రాజకీయ విశ్వసనీయత నిలబడుతుందని దేవి రవీందర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కళ్యాణ్ నగర్ నర్సింగరావు, గొడుగు స్వామి, మాజీ సర్పంచ్ బచ్చలి మైపాల్, చిక్కుడు నర్సింలు, సంతోష్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.