calender_icon.png 10 January, 2026 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న్యాయం చేయాలి

06-01-2026 12:00:00 AM

ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్

వెంకటాపూర్, జనవరి 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, వారికి రావాల్సిన అన్ని రకాల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయఉద్యోగ వర్గాలు అనేక నిరసన కార్యక్రమాల్లో ముందుండి పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించాయని, అటువంటి వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని, అర్హత ప్రకారం పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణమే అమలు చేసి 50 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ మంజూరు చేయాలని, అలాగే నూతన పే స్కేల్లను అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేసి, ఆ కాలానికి సంబంధించిన వేతనాలను విడుదల చేయాలని కోరారు.

అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు వెంటనే తగిన నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం, ఆర్థిక కార్యదర్శి శంకర్, జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు సామ్సన్, రాష్ట్ర సీనియర్ సంఘ నాయకులు కృష్ణయ్య, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు హమీద్, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.