22-07-2025 01:07:10 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాం తి): బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుచేయడం అసాధ్యమని, న్యాయపరమైన చిక్కులున్నాయని తెలిసికూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. బీసీలను తప్పుదోవ పట్టించేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. బీసీలతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతోందని అన్నారు.
సోమవారం రాంచందర్‌రావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడు తూ.. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. తొమ్మిదో షెడ్యూల్లోకి చేర్చడం కేం ద్రం బాధ్యత అని కాంగ్రెస్ ప్రభుత్వం తమ పై నెట్టివేసే ప్రయత్నం చేస్తుందని, కానీ న్యా యపరమైన సలహా తీసుకోకుండా ఆర్డినెన్స్ ఎలా తీసుకొచ్చారన్నారు. తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టే ప్రక్రియపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు.
అది న్యాయ సమీక్ష పరిధిలో ఉంటుందన్నారు. ఐఆర్ కోహ్లి, కేశవానంద భారతి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలో కి తీసుకోలేదని పేర్కొన్నారు. న్యాయపరమై న చిక్కులు తెలిసి బీసీలను మోసం చేస్తున్నందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చూసేందుకు ఇదో ఎత్తుగడగా ఆయన ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌లో ఏం పొందుపరిచారో ప్రజలకు ఎం దుకు తెలియజేయడం లేదని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 ప్ర కారం రిజర్వేషన్ల కోసం శాసనసభలో సవర ణ చేయాల్సి ఉందన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించకపోవడం బాధాకరమన్నారు.
రేవంత్‌రెడ్డి గత 19 నెలల్లో ఢిల్లీకి మొత్తం 46 సార్లు వెళ్లారని.. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ కీలకనేతలు ఆయనకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. కానీ ప్రధాని మోదీ, కేం ద్రమంత్రులు మాత్రం సీఎంకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు.
రాహుల్‌గాం ధీ.. తెలంగాణ సీఎంను కలవనివ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు. సోమవారం పార్టీ వ్యవహారాలపై సునీల్ బ న్సల్, అర్వింద్ మీనన్, నితిన్ గడ్కరీని కలిశానని, మంగళవారం పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమి త్‌షాను కలువనున్నట్టు చెప్పారు.
క్రమశిక్షణ తప్పితే చర్యలే..
బీజేపీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే క చ్చితంగా చర్యలు తీసుకుంటామని బీజేపీ స్టే ట్ చీఫ్ స్పష్టం చేశారు. పార్టీలో కొత్త,పాత అనే తేడా లేనే లేదన్నారు. ఈ తేడాలన్నీ కొంతమంది కావాలనే సృష్టిస్తున్నవని తెలిపారు. రాష్ర్ట అధ్యక్షుడిగా పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
బండి సంజ య్- ఈటల వ్యవహారంపై ఇప్పటికే అధిష్ఠా నం దృష్టికి తీసుకుపోయినట్టు మీడియా అ డిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కాంగ్రెస్-,బీఆర్‌ఎస్ పార్టీలు ఒకే తాను ముక్కలని.. గతంలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇద్దరూ కలిసి వెళ్లడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.