calender_icon.png 22 July, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలి

22-07-2025 01:06:06 AM

గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల జేఏసీ

ముషీరాబాద్, జూలై 21: కారోబర్, బిల్ కలెక్టర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల జే ఏసీ రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జేఏసీ నాయకులు మామిడాల నరసింహు లు యజ్ఞ నారాయణ, బింగి గణేష్, సాదుల శ్రీకాంత్, బాలరాజు పాల్గొని మాట్లాడారు.

జీవో 51 నుంచి కారోబార్, బిల్ కలెక్టర్ మినహాయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని త్వరలో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థా యిలో ఆత్మీయ సమ్మేళనం హైదరాబాదులో నిర్వహించడం జరుగుతుందని వెల్ల డించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి లను ఆహ్వానించిన ట్లు తెలిపారు. జేఏసీ రాష్ట్ర మీడియా మీడియా ఇంచార్జ్ తేలుకంటి మురళి, నేతలు పాల్గొన్నారు.