calender_icon.png 22 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు

22-07-2025 01:07:21 AM

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డా. కోట నీలిమ

సనత్‌నగర్, జూలై 21 (విజయక్రాంతి):- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డా. కోట నీలిమ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, లీగల్ సెల్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నేతలు,

కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీకి మల్లికార్జున్ ఖర్గే సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. బహుజన సమాజం కోసం ఆయన చేస్తున్న పోరాటం అద్భుతమని కొనియాడారు. పార్టీ కార్యకర్తలు ఖర్గే నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని.. ఆయన నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం ఖాయమని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల ఖర్గే ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు.