12-09-2024 10:56:03 AM
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు.. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుంది.
రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి ?, ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి ?, డిసెంబర్ లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ?, 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రం లో ఏం జరుగుతుందో చూడాలని కోరారు. రైతులు ఆత్మ హత్యలు చేసుకోవద్దు..దైర్యంగా ఉండాలని కేటీఆర్ కోరారు.