04-07-2025 12:10:48 AM
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్
శాలిగౌరారం, జూలై 3: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలులో లో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు.గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసమర్థ పాలనను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు కార్యకర్తల పై,నాయకులపై కేసులు పెడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన పట్ల అవగాహన లేదని,మంత్రులందరూ ఎవరికి వారే ముఖ్యమంత్రులు లాగా వ్యవహరిస్తూ పాలన ను గాలికి వదిలేశారని అన్నారు. మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు మార్పు కోరుకుంటే,పాలన చేతకాక ప్రతిక్ష నాయకులపై ఈ రేసింగ్,ఫోన్ టాపింగ్ తదితర కేసులంటూ వేధిస్తున్నారని, ఆయా కేసులలో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్,కేటీఆర్ పాత్ర ఏమి లేకుండా వారిని అభాసు పాలు చేయాలనీ చూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న రైతులకు చేస్తామన్న రుణమాఫీ కొందరికే చేసి అందరికి చేశామని అంటున్నారని, సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ వట్టి బోగస్ అయ్యిందన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దూరద్రుష్టి తో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని కట్టి రైతులకు నీళ్లు అందించి రైతుల ను లాభ దాయకం లోకి తెస్తే,ఈ ప్రభుత్వం దానిని ఓర్వలేక కాళేశ్వరం పై అసత్య ఆరోపణలు చేస్తూ కే సీ ఆర్ పై నిందలు వేస్తూ,అయన ప్రతిష్ట ను దెబ్బ తీస్తున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఐతగోని గోని వెంకన్న గౌడ్,మాజీ అధ్యక్షులు కట్టా వెంకటరెడ్డి,మామిడి సర్వయ్య, గుండా శ్రీనివాస్, గుజిలాల్ శేఖర్ బాబు,జేరిపోతుల చంద్రమౌళి, దుబ్బ వెంకన్న,మహేశ్వరం వెంకన్న, గుండ్ల వెంకటయ్య, పాక రాములు,రాపాక రాజు,భూపతి ఉపేందర్,చింతల శంకర్,తీగల వెంకన్న, మేడిపల్లి జలంధర్, పనికెర కమలాకర్,రాచకొండ గణేష్, నిమ్మల సురేష్, దేవరకొండ సైదులు, నోముల శ్రీనివాస్, పీర్నాయకం గిరి, చీమల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.