calender_icon.png 6 July, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక తోడి నిలువ చేసేందుకు టెండర్ల ఆహ్వానం

04-07-2025 12:08:59 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం జూలై 3 (విజయ క్రాంతి); సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచ లం పరిధిలో గోదావరి నదికి చెందిన ఇసుక  రీచ్ ల  నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసు క వెలికి తీసి, ఇసుకను నిలువ చేయు ప్రదేశానికి సరఫరా చేయడానికి, లారీలలో నిం పడానికి ఒక్కో రీచ్ కు 2 ఎస్కవేటర్లు, 4 టి ప్పర్లు, 2 డోజర్లు ,2 వాటర్ స్ప్రింక్లర్లు అద్దె చెల్లింపు పద్ధతిలో కావలెనని, ఇందుకు సం బంధించి ఆసక్తి గల గిరిజన ఏజెన్సీలు ఐటీడీఏ భద్రాచలం వారితో ఎంపానెల్ చేసు కోవడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు. 

 దరఖా స్తు ఫారాలు ఐటిడిఏ కార్యాలయంలోని రూమ్ నంబర్ జి -23, ఐటీడీఏ భద్రాచలం నందు ఈ నెల 4 నుండి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల మధ్యలో లభించు నని, ఒక్కో ఫారం రుసుము రూ.10,000/-లకు లభించునన్నారు.పూర్తిచేసిన దరఖాస్తు ఫారం,ఇ ఎండీ రూ.2,00,000/-(రెండు లక్షల రూపాయలు), ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ భద్రా చలం పేరిట తీసిన డిడి తో పాటు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఐటీడీఏ భద్రాచలం నందు సమర్పించ వలెనని, దీనిపైన సమయాను సారం మార్పులు చేయడానికి, షరతులు విధించడానికి, ఎలాంటి కారణాలు తెలియజేయకుండా తగిన నిర్ణయం తీసుకోవడానికి ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ భద్రాచలం వారికి పూర్తి అధి కారాలు ఉండునని ఆయన తెలిపారు.ఇతర వివరాలు కొరకు ఫోన్ నెంబర్ 9398 447909 నందు సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.