04-07-2025 12:10:52 AM
24 గంటలు అందుబాటులో ఉండాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జులై 3 (విజయ క్రాంతి); జిల్లాలో భారీ వర్షాలు అనే పద్యంలో రాబోయే రోజుల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి విషద్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారంజిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు..విష జ్వరాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు, రీఏజెంట్లు, టెస్టింగ్ కిట్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు.
వివిధ హోదాల్లో ఉన్న వైద్య సిబ్బంది సమయపాలన పాటించి 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు .ఇప్పటికే అన్ని ఆసుపత్రులలో కావాల్సిన మందులు రీఏజెంట్లు ,మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేసిన క్రమంలో రాబోయే రోజుల్లో రోగులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు,ఫార్మసిస్టులు ,నర్సింగ్ సూపరింటెండెంట్ లు మరియు శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.