20-01-2026 12:00:00 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, జనవరి 19 (విజయ క్రాంతి): కోటిమంది మహిళలను కోటీశ్వరులను చే యడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో 938 స్వయం సహాయక మ హిళా సంఘాలకు 2,98,40,444 కోట్ల రూ పాయల జంబో చెక్ జగిత్యాల ఎమ్మెల్యే సం జయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ లతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సం దర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ద్వారా తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆద్వర్యంలోని ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మొదటి సంతకం మహాలక్ష్మి పథకం అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను విద్య, వైద్యం, మహిళాభివృద్ధికి ఇస్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధిచేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సోలార్ పవర్ ప్లాంట్ లు, పెట్రోల్ బంక్, మహిళలకు వడ్డీ లేని ఋణాలు, అద్దెకు బస్సులు, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అందిస్తుందన్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సమావేశ నిర్వహణ కోసం, 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం త్వరలో పూర్తికాబోతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన, మెప్మా ఏవో శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అద్యక్షురాలు, జిల్లా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.