25 March, 2026 | 7:52 AM

రైతుల పక్షపాతి కాంగ్రెస్‌ ప్రభుత్వం

10-11-2025 08:01 PM

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ వైనాల రాజు 

ముత్తారం,(విజయక్రాంతి):   రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కమాన్‌పూర్‌ మార్కెట్ కమిటీ చైర్మన్‌ వైనాల రాజు అన్నారు. సోమవారం ముత్తారం మండలంలోని మచ్చుపేట, మైదంబండ, కేశనపల్లి, ముత్తారం, అడవీ శ్రీరాంపూర్‌, ఖమ్మంపల్లి, హరిపురం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి సారించి మండలంలో కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయించారని, ప్రతి రైతుకు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆందోళన పడాల్సి అవసరం లేదని, ప్రతి గింజను మద్ధతు ధరపై ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.

సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇచ్చిన ఘనత భారత దేశంలో తెలంగాణకే దక్కిందన్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల వరకు కోత విధిస్తూ రైతులకు న్యాయం చేసిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలున్న నేరుగా తమకు గానీ, ఎఎంసి డైరెక్టర్లకు గానీ సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ మద్దెల రాజయ్య,  మైనారిటీ సెల్‌ మండల అధ్యక్షుడు వాజిద్‌ పాషా, మాజీ సర్పంచ్‌ వేల్పూరి సంపత్‌ రావు, గోవిందుల పద్మ ఆనంద్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు బొలినేని బుచ్చం రావు, జాగిరి సమ్మయ్య, ఆరెల్లి శ్రీనివాస్‌, సిగ్గం మురళీకృష్ణ, గుగులోతు ప్రవీణ్‌ నాయక్‌, ఎఈఓ హారిక, సిసిలు తిరుపతి, ఎల్లమ్మ, కవిత, రాధికతోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.