10-11-2025 08:02:28 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అంగడి బజారు ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ తన సెల్ ఫోన్ ను నెల రోజుల క్రితం పోగొట్టుకోగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన ఫోన్ రికవరీ చేసి బాధితునికి పట్టణ ఎస్సై రాజశేఖర్ అందచేశారు. పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ వివరాలు వెల్లడించారు. బాధితుడు నెల క్రితం 30 వేల విలువచేసే మొబైల్ ఫోను ను పట్టణం లోని పాత బస్టాండ్ ప్రాంతంలో పోగొట్టుకోగా, వెంటనే సిఇఐఆర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందచేశారు.
ఈ మేరకు నూతన టెక్నాలజీ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ గుర్తించి బాధితునికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాధితులు ఎవరైనా తమ ఫోన్ ను పోగొట్టుకుంటే వెంటనే సిఇఐఆర్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తద్వారా పోయిన సెల్ ఫోన్ రికవరీ చేయడం సులభం అవుతుందన్నారు.