calender_icon.png 22 July, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలతో పరుగులు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

21-07-2025 12:00:00 AM

  1. పది సంవత్సరాలుగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వని బిఆర్‌ఎస్ పార్టీ

పుట్టే బిడ్డ వరకు అప్పుచేసిన కేసీఆర్

ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకలనే కాంగ్రెస్ ఆలోచన

ప్రతి ఒక్క లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందుతాయి

రాజన్న సిరిసిల్ల: జులై 20 (విజయక్రాంతి) ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏ ఏం ఆర్ గార్డెన్ లో రెవిన్యూ శాఖ ఆధ్వర్యం లో నూతన రేషన్ కార్డు లు పంపిణి.ప్రతి పే దవాడు ప్రతిరోజు పండగల జీవించాలనే ఆ లోచనతో సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీ పరుగులు పెట్టిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి, అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పొందాలనే ప్ర తి నిరుపేద కుటుంబానికి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచనతో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమా న్ని మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ము స్తాబాద్ మండల కేంద్రంలో ఏఎమ్‌ఆర్ గా ర్డెన్ లో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి డి సి ఎస్ ఓ రజిత, ఏసీఎస్‌ఓ శ్రీలత, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏ ఎంసీ చైర్మన్ తలారి రాణి -నరింహులు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,ముఖ్య అతిథులు గా విచ్చేశారు.

ఈ సందర్బంగా చక్రధర్ రెడ్డి, బాల్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కా లంలో బిఆర్‌ఎస్ పార్టీ ఏ ఒక్క అర్హునికి రేష న్ కార్డు ఇవ్వలేదని అన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను పొందాలని గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టారని తెలిపారు. ఎలక్షన్లు ఇచ్చి న మాట ప్రకారం రేషన్ కార్డులు జారీ చేశారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ప్రతి అర్హునికి రే షన్ కార్డు ఇవ్వాలనినే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే పథకా లను చూసి బిజెపి బీఆర్‌ఎస్ పార్టీ ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. సంక్షేమ పథకాలలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడని అన్నా రు. రైతులకు రైతు భరోసా, రైతు రుణమా ఫీ, మండలానికి 574 ఇందిరమ్మ ఇండ్లు, మంజూరు చేశారాని తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాల నుండి రుణాలు, వడ్డీ లేని రుణం సన్న బి య్యం, 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూ నిట్ల కరెంటు ఉచితం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వ చ్చే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో ప్రజలు కాం గ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గజ్జెల రాజు, రాంరెడ్డి,రెవిన్యూ సిబ్బంది, నా యకులు తదితరులు పాల్గొన్నారు.