21-07-2025 12:00:00 AM
-‘షాప్’ ఆధ్వర్యంలో 5వ బ్యాచ్
ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా భాషా, తెలంగాణ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, సిగ్మా అకాడమీ అఫ్ ఫొటోగ్రఫీ (షాప్) సంయక్త ఆధ్వర్యంలో ఉచితంగా 5వ బ్యాచ్ ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు నిర్వహి స్తున్నామని అకాడమీ చైర్మన్ ఎంసి శేఖర్ వెల్లడించారు.
యువత ఈ సమగ్ర ఉచిత ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సును పూర్తి చేసి ఉపాధి పొందవచ్చునని తెలిపారు. హైద రాబాద్‌లో నిర్వహించే ఆరు నెలల (ఆఫ్‌లైన్) ఉచిత ఫోటో గ్రఫీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు.
హిమాయత్‌నగర్ సిగ్మా కార్యాలయంలో ‘5వ బ్యాచ్‘ ఉచిత ఫోటోగ్రఫీ డిప్లొమా కోర్సు వాల్ పోస్టర్‌ను అకాడమీ చైర్మన్ ఎం.సి.శేఖర్, భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. ఆగస్టు 5 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమౌతాయని తెలిపారు. వివరాలకు 8008021075, - 7095692175 నంబర్లలో సంప్రదించా లని సూచించారు.