21-07-2025 12:00:00 AM
-కార్పొరేటర్ అర్చనజయప్రకాశ్ ఆధ్వర్యంలో సంబురాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 20 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల జాతరను రాజేంద్రనగర్ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో ఆదివారం నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉత్సాహాన్నిపంపిన ఈ బోనాల కార్యక్రమంలో కార్పొరేటర్ అర్చనజయప్రకాశ్ ప్రత్యేక అతిథిగా హాజరై తల్లికి బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురాణ సంప్రదాయాలను నిలబెట్టుకోవడంలో బోనాలు ముఖ్యపాత్ర వహిస్తున్నాయని చెప్పారు. మాహాకాలి తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో శాంతి, ఐశ్వర్యం నిండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు జేవందాస్, యాదయ్య, రమేష్, నరసింహ, జగన్, అశోక్ పాల్గొన్నారు. భక్తులు తల్లికి బోనాలు సమర్పిస్తూ డప్పులు, తాళాలు, బజాలతో ఊరేగింపుగా ఆలయాల దిశగా సాగారు.