20 March, 2026 | 7:17 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మేం చేసిన రైతు పంటల రుణమాఫీ దేశంలోనే రికార్డు

30-07-2024 02:37 PM

హైదరాబాద్: వరంగల్ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చి హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తున్నమని ముఖ్యమంత్రి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతుల పంటల రుణమాఫీ నిధుల కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మట్లాడుతూ... రెండో విడతలో రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేశామన్నారు.

ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండుగ రోజుగా మరడంతో మా జన్మ ధన్మమైందని సీఎం తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనాలే మా ప్రభుత్వ విధానమని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేసి ఈ పదేళ్లలో రూ.14 లక్షల కోట్లు ఎగవేశారని సీఎం వెల్లడించారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారని, అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి చనిపోయారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేది మా విధానమన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందని, వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని సీం పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం రుణమాఫీ చేయలేదని కొంతమంది విమర్శంచారు. ఎలాంటి పరిస్థతులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరాలని చెప్పామన్నారు. రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనామని, దేశ భద్రత, ఆహార భద్రతకు మా పార్టీ ప్రాముఖ్యత ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

రైతుల కష్టాలను గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదే ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నది మాపార్టీ అని, ఆరు గ్యారంటీల అమలుకు మంత్రులందరూ నాకు అండగా నిలబడ్డారన్నారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని, మేం చేసిన రైతు పంటల రుణమాఫీ దేశంలోనే రికార్డు అని ఆయన తెలిపారు. గతంలో ఏ రాష్ట్రం కూడా రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయలేదని, రైతులకు అండగా ఉంటామనే విశ్వాసం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.