calender_icon.png 12 November, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు రెండోవిడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉంది

30-07-2024 01:37:48 PM

హైదరాబాద్: రైతులకు రెండోవిడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మా ప్రభుత్వం రైతుల మేలు కోసం ఎన్నో చర్యలు చేపట్టిందని, అందుకోసం ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం రైతు పంటల రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి భట్టి పేర్కొన్నారు.

రెండో విడతలో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర ఉన్న 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ అవుతున్నాయి. ఎన్నికల ముందు వరంగల్ సభలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పుడు అదరూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిజం చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతలుగా చేసి చివరి విడత సగం వదిలేసిందన్నారు. 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదనుకున్నవాళ్లకి మేం రుణమాఫీ చేసి చూపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.