calender_icon.png 10 September, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు

10-09-2025 12:10:39 AM

  1. పదేళ్లలో జరగని అభివృద్ధి 20 నెలల్లోనే అభివృద్ధి 

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

భూత్పూర్, సెప్టెంబర్ 9: గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు లు వేస్తుందని దేవరకద్ర నియోజకవర్గం ఎ మ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మం గళవారం భూత్పూర్ మండల పరిధిలోని తాటిపర్తి గ్రామంలో అంగన్వాడి స్కూల్ భవ న నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశా రు. అనంతరం రూ 1 కోటి ఐదు లక్షల నిధులతో పెద్దతండ నుండి లోక్యతాండ వరకు వీ టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.

వెలికిచర్ల గ్రామంలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు, రూ. 40 లక్షల నిధులతో అంగన్వాడి, హెల్త్ సెంటర్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరగని అభివృద్ధి కేవలం 20 నెలల్లో నే అభివృద్ధి చేసి చూపించామని ఆయన అ న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమా లు చేపడుతుందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు.

మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి వారిని ఆ బస్సులకు ఓనర్లుగా చేసి మహిళా సంఘాలకు ఉపాధి కల్పించామన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థులకు స్కూ ల్ యూనిఫాంలో కుట్టే కాంట్రాక్టు, ఏందిరా మహిళ శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం లాంటి పథకాలు ప్రారంభించామన్నారు. వడ్డీలు, చక్రవడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలికాకుండా మహిళా సం ఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.

మహిళలు వంట గదికే పరిమితం కా కుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో ఇ న్చార్జి ఎంపీడీవో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కాం గ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ, పట్టణ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్‌తో టు తదితరులు పాల్గొన్నారు.