10-09-2025 12:12:28 AM
లింగంపేట్ మండలంలో పర్యటించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్
ఎల్లారెడ్డి, లింగంపేట సెప్టెంబర్ 9(విజయక్రాంతి) : లింగంపేట రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైసరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పని చేసి, విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు.
వసతి గృహాల అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం అంగన్వాడీ టీచర్లకు నూతన యూనిఫార్ములను పంపిణీ చేశారు. లింగంపేట మండలం, పోతాయిపల్లి గ్రామం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఈరోజు పోతాయిపల్లి గ్రామాన్ని పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న టేకుల చెరువు, పంట పొలాలు, రహదారులు మరియు గ్రామంలోని దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు.
అనంతరం, భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లను జరుగుతున్న మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఆస్తి నష్టం & పంట నష్టం పై నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయానికి అందజేశాను. రైతులు మరియు ప్రజలకు సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తాను అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి ఆర్డీవో, హాస్టల్ అడ్వైసరీ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.