calender_icon.png 10 September, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ నారాయణరావు కృషి ఎనలేనిది

10-09-2025 12:10:28 AM

కామారెడ్డి జిల్లాలో ఘనంగా కాళోజీ జయంతి  పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

కామారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా కాళోజి నారాయణరావు111వ జయంతి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కామా రెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కాలోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. జిల్లా ఎస్పీ కార్యాల యంలో కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సిబ్బంది తో కలిసి నివాళులర్పించారు.

తెలుగు మాతృ భాష పై కాలోజి నారాయణరావు ఎనలేని కృషి చేశారని  అన్నారు. మాతృభాషపై ఉన్న ఆయన అంకితభావం మనంద రం మాతృభాషను కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్ డిబిసిడిలో జయరాజ్ అసిస్టెంట్ బి సి డి వో చక్రధర్ సాహితి మిత్రులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, శివరాం, గంగారాం, నాగరాజు, నరేష్, పవన్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

 ఎస్‌ఆర్‌ఎన్ కె డిగ్రీ కళాశాలలో..

బాన్సువాడ, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమరయోధుడు కాలోజీ అని  బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ప్రిన్సిపాల్ గంగాధర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.తెలుగు విభాగం, ఐక్యూఏసీ, ఎన్‌సీసీ,ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా కాళోజీ నారాయణ రావు చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ గంగాధర్ మాట్లాడుతూ కాళోజీ స్వాతంత్య్ర సమరయోధుడి గానే కాకుండా తెలంగాణ యాసకు, మాండలికాలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు జైలు శిక్ష అనుభవించడమే కాక, వరంగల్ నగర బహిష్కరణను కూడా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి గోపాల్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వినయ్ కుమార్, ఎన్‌సీసీ అధికారి కృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు శ్రీనివాస్, రాజేష్, అనిత, అధ్యాపకులు శంకర్‌రావు, బట్టు విఠల్, శేఖర్, సుధాకర్ రెడ్డి, వినోషన్, మనోహర్ పాల్గొన్నారు.

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం

మద్నూర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా  తాసిల్దార్ ఏండి ముజీబ్  మాట్లాడుతూ.... తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని, తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితలతో ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు. భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింపబడి న ప్రజాకవి కాళోజీ స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.ఈ జయంతి కార్యక్రమంలో తహసీల్దార్ తో పాటు కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.