20 May, 2026 | 7:20 AM

కాంగ్రెస్‌కు మాట్లాడే హక్కు లేదు

20-05-2026 12:00 AM
  1. విదేశాలతో పోల్చితే మనవద్ద పెట్రోల్ తక్కువే పెరిగింది
  2. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): విదేశాలతో పోల్చితే మన వద్ద పెట్రోల్, డీజిల్ తక్కువ పెరిగిందని, పెట్రోల్ ధరలపైన మాట్లాడానికి కాం గ్రెస్‌కు హక్కు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 5 లక్షల కోట్ల ఆయిల్ బాండ్స్ అమ్మిందని చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ముందుగానే చెప్పారని, యుద్ధం జరిగితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవా రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ వచ్చిన తర్వాత ఆ బాండ్స్ అన్ని బీజేపీ కడుతుందని, వాటికి వడ్డీతో సహా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. తెలంగాణలో పాత సీఎం కేసీఆర్ పెంచారు, కొత్త సీఎం రేవంత్ రెడ్డి రేట్లను పెంచారన్నారు.  మహారాష్ట్రలో రూ.109, గుజరాత్ రూ. 98.30, ఢిల్లీలో రూ.97, తెలంగాణలో రూ.111.88 ఉందన్నారు.