కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌లది ‘సుఖసంసారం’
- ఒకరినొకరు కాపాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు
- కాంగ్రెస్ బెయిల్ పార్టీగా మారింది
- బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని గత పదేళ్లు దోచుకున్న బీఆర్‌ఎస్, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు తెరవెనుక ఒకరినొకరు సహకరించుకుంటూ ‘సుఖసంసారం’ సాగి స్తున్నాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఉనికి కోల్పోతోందన్నారు.
బెయిల్ పార్టీగా కాంగ్రెస్ మారిందని, ఆ పార్టీ ముఖ్యనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ బెయిల్ మీద ఉన్నారన్నారు. ఆ పార్టీలో అనేక మంది నాయకులు జైలుకు వెళ్లి వచ్చినవారేనని విమర్శించారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్, విద్యుత్ కొనుగోలు, జన్వాడా అక్రమ కట్టడాల కేసుల్లో కేటీఆర్ నోటీసులు అందుకున్నారని తెలిపారు. మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె జైలుకు వెళ్లిందని, కేసీఆర్ కుటుంబం కేసుల నుంచి తప్పించుకునేందుకు కోర్టు తలుపు లు తట్టి రక్షణ కవచం ఏర్పర్చుకుందని పేర్కొన్నా రు.
అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వీ ళ్లు బీజేపీకి నీతులు చెబుతారా? అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో కుక్కల కాటుకు చిన్నారులు బలి అయ్యారని, భవనాలు కూలిపోవడం వంటి సంఘటనల్లో తండ్రి, కొడుకులు (కేసీఆర్, కేటీఆ ర్) రాజీనామా చేయలేదన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ కాపాడారని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అవినీతి కేసుల నుంచి రాహు ల్‌గాంధీ కాపాడుతున్నారన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఊసలు లెక్కపెట్టాల్సి వస్తదని, ప్రభు త్వ ఆస్తులు కరిగిపోయాయి.. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెరిగిపోయాయని తెలిపారు. కేటీఆర్ 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పదుల కోట్లలో ఆదాయం చూపించారు.. ఇప్పుడు అది వందల కోట్లు ఎట్లా అయ్యిందని ఆయన ప్రశ్నించారు.






