6 May, 2026 | 5:17 AM

అమరుల స్థూపాన్ని తాకే అర్హత కాంగ్రెస్‌కు లేదు

27-04-2024 01:07 AM

బిఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, ఏప్రిల్ 26  (విజయక్రాంతి): తెలంగాణ అమరవీరుల స్థూపం తాకే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని, సీఎం రేవంత్‌రెడ్డి అనుచరులతో మలినపడిందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి భయపడి ఆరు గ్యారెంటీలు అమలు చేయలేనని పరోక్షంగా ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అనుచరులు స్థూపం కడుతున్నారని, తెలంగాణ ద్రోహి స్థూపం కట్టడం సిగ్గుచేటన్నారు. సమైక్యవాదులకు మద్దతిచ్చినవారు తెలంగాణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణ భవన్‌లో శుక్ర వారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులైన ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందు గా అమరులకు నివాళ్లు అర్పించే సంస్కృతి ఉందని, బీఆర్‌ఎస్ పార్టీకి స్థూపం దైవంతో సమానమని పేర్కొన్నారు. 1969లో కాంగ్రెస్ కర్కశత్వా నికి ఆనాడు 369 మంది అమరులు అయ్యారని,  వారి త్యాగాలకు గుర్తు గా స్థూపం నిర్మించినట్లు పేర్కొన్నా రు. ఏనాడైనా కాంగ్రె స్ నేతలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? జై తెలంగాణ నినాదాలు చేశారా? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో పదవులకు రాజీనామా చేయమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన కాంగ్రెస్ నేతలకు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.