డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన దినోత్సవం

27-04-2024 01:06:16 AM

ఆకట్టుకున్న దేశీ విత్తనాల ప్రదర్శన

ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలను కాపాడుకుందాం

జహీరాబాద్, ఏప్రిల్ 26 : పస్తాపూర్ డీడీఎస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీ య విత్తన దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం డీడీఎస్ పరిధిలోని 23 గ్రామాలకు చెందిన మహిళా రైతులు, విత్తన సంరక్షకులు దాదా పు 80రకాల దేశీ విత్తనాలను ప్రదర్శించారు. ఇందులో కనుమరుగవుతున్న ఎర్ర పెస రి, నల్లతొగరి, బురఖతొగరి, పచ్చశనగ, నల్లబెబరి విత్తనాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. పలువురు మహిళ రైతులు, సంరక్షకులు మాట్లాడుతూ చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. హైబ్రిడ్ విత్తనాల మాయలో పడి రోగాలను కొనితెచ్చుకుంటున్నామన్నారు. చిరుధాన్య ల్లో పప్పు, నూనేదినుసులు వంటి విత్తనాలు కాపాడుతున్నామన్నారు. ప్రస్తు తం రైతులు ఒకే రకం విత్తనాలు సాగు చేస్తూ నష్టపోతున్నట్టు తెలిపారు. చిరుధాన్యలతో పంటలు సాగు చేస్తే రైతులకు కొంతమేర మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీడీఎస్ మహిళలు, సంరక్షకులు పాల్గొన్నారు.