calender_icon.png 3 February, 2026 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'నా గొంతు కోశారు'.. జీవన్ రెడ్డి అసంతృప్తి

03-02-2026 01:47:52 PM

హైదరాబాద్: జగిత్యాల మున్సిపాలిటీలో(Jagtial Municipality) టికెట్ల కేటాయింపుపై అసమ్మతి నెలకొంది. టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి(Congress senior leader Jeevan Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కు టికెట్లు ఇచ్చారని జీవన్ రెడ్డి నారాజ్ అయ్యారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 సీట్లుకు సంజయ్ వర్గానికి 30 సీట్లు, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి 20 కేటాయించారు. దీంతో జీవన్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'నా గొంతు కోశారు' జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. టికెట్ల కేటాయింపుపై పాత కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ బీ-ఫారమ్‌లు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. జగిత్యాలో టికెట్ల పంచాయతీ నేపథ్యంలో ఎమ్మెల్యే కార్యాలయం, సంజయ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.