రామేశ్వరానికి బస్సు సర్వీసు
నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ ద్వారా నిర్మల్ డిపో నుండి జులై 5 వ రామేశ్వరం ప్రత్యేక సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. భక్తుల ప్రయాణికుల కోరిక మేరకు ఈ బస్సు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఈ బస్సు 5 వ తేదీ మ!! ఒంటి గంటకు నిర్మల్ నుండి బయలుదేరి కానిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, మధురై, రామేశ్వరం ధనుష్ కోడి, కంచి పురము బంగారు బల్లి వెండి బల్లి, శ్రీ కాళహస్తి చూయించుకొని తిరిగి జులై 11వ తేదీ నిర్మల్ చేరుకుంటుందని డిపోమేనేజర్ తెలిపారు. 7 రోజుల ప్రయాణం ఛార్జి 8000/- రూ!! లు ఉంటుందని ఆయన తెలిపారు. ఆసక్తి కలవారు నిర్మల్ బస్టాండ్ లో గాని మీ యొక్క ఫోన్ లో గాని ముందుగా బుక్ చేసుకోవాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు. 9959226003, 9440018549లో సంప్రదించాలని ఆయన తెలిపారు.






