25 April, 2026 | 4:48 PM

కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. దాడులకు కుట్ర: ఆది శ్రీనివాస్

20-12-2024 12:51 PM

కేటీఆర్ ను అరెస్టు చేస్తే దాడులు చేయాలని కుట్ర

లగచర్ల ఘటన తరహాలో మళ్లీ కేటీఆర్ కుట్ర

హైదరాబాద్: కేటీఆర్ ను అరెస్టు చేస్తే దాడులు చేయాలని కుట్ర జరుగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కేటీఆర్ ఆత్మ, బినామీ తేలుకుంట్ల శ్రీధర్ కుట్రలు చేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు. నియోజకవర్గానికి రూ. కోటి పంపించి దాడులకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి, దాడులకు కుట్ర పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు. కుట్రల పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లగచర్ల ఘటన తరహాలో మళ్లీ కేటీఆర్ కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ కుట్రల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.