కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం
07-05-2024 12:39 AM
మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, మెతుకు ఆనంద్
రంగారెడ్డి, మే 6 (విజయక్రాంతి) : కాంగ్రెస్ రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులను ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.




