హైకోర్టు తీర్పు పేద విద్యార్థులకు అన్యాయం
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు పేద విద్యార్థులకు అన్యాయం: డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్
దేవరకొండ,(విజయక్రాంతి): విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు వలన పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు ఇవ్వడం వలన పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు.
ఈ తీర్పు వల్ల సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న రూ. 6,500 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, నట్వ సుధాకర్, కాటం వెంకటేష్ గౌడ్, శివ, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.




