6 April, 2026 | 1:38 PM

రెండవసారి అంకం కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ పదవి

06-04-2026 11:44 AM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవికి "అంకం" కుటుంబానికి కలిసి వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ఖానాపూర్ మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా మారిన తర్వాత మొదటిసారిగా చైర్మన్ పదవి అప్పటి బీఆర్ఎస్ నాయకుడు అంకం రాజేందర్ ను వరించింది, అనంతరం కాలగమనంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో రాజేందర్ పదవి కోల్పోయి నప్పటికి మొదటి చైర్మన్గా రాజేందర్ రికార్డు నమోదు చేశారు. ప్రస్తుతం రెండవ పాలకవర్గంలో కూడా అదే కుటుంబానికి చెందిన అంకం రాజేందర్ సోదరుడు బిజెపి పార్టీ నాయకులు అంకం మహేందర్ భార్య అంకం మౌనికకు చైర్మన్ పదవి దక్కడంతో మరోసారి చైర్మన్ పదవి అంకం కుటుంబానికి దక్కినట్లు అయింది. కాగా చైర్మన్ పదవి అంకం కుటుంబానికి కలిసి వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.