6 April, 2026 | 10:09 AM

మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదం

07-05-2024 12:37 AM

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఉబేదుల్లా కొత్వాల్

సిద్దిపేట/గజ్వేల్, మే 6 (విజయక్రాంతి): మళ్లీ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతదని రాష్ట్ర మైనా ర్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఉబేదుల్లా కొత్వాల్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతు ల్లా ఉసైని, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గ మైనార్టీనాయకుల ఆధ్వర్యంలో మైనార్టీ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొని ప్రసంగించారు. దేశం లో ప్రజలను బీజేపీ ప్రభుత్వం కులా లు, మతాలుగా విభజించి ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతుందన్నారు. బీజేపీ వైఖరి వల్ల ప్రజ ల్లో ఐక్యత లోపిస్తుందని, ఉత్తరప్రదేశ్ లాం టి రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. 

ప్రజలు బీజేపీ చేస్తున్న అరాచకాలను గుర్తించి మేల్కోవాలన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే ప్రయాత్నంలో ఉన్నారని తెలిపారు. బీజేపీ పాలన వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని, తీవ్ర అన్యాయానికి గురవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉంటారని, అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుం దన్నారు. మెదక్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి నీలంమధును గెలిపించి దేశంలోనూ కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మైనార్టీ నాయకు లు సర్ధార్‌ఖాన్, మతిన్, సాజిద్, మాజీ హౌ సింగ్ కార్పొరేషన్‌చైర్మన్ భూంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.