చంద్రయ్య కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం అందజేత
06-04-2026 11:46 AM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఏగూరి చంద్రయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మరణించడంతో అతని తోటి స్నేహితులు ఆ కుటుంబానికి సోమవారం అండగా నిలిచారు. స్నేహితులంతా కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.21,500 ఆర్థిక సాయం అందించి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్నట్లు పలువురు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరబోయిన నాగయ్య, కటకం శ్రీను, కునీయత్ నవీన్ కుమార్, సంతోషి, శాంతయ్య, మైసయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.




