calender_icon.png 18 June, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేక్ ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు రాజేష్ కుమార్

18-06-2025 06:40:29 PM

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy)ని పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ డిపార్ట్మెంట్ మాజి కన్వీనర్ చెన్నూరు నియోజకవర్గం, అంబేద్కర్ సేన ప్రధాన కార్యదర్శి తుంగపిండి రాజేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, బుధవారం హైదరాబాద్ సచివాలయం లోని తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రి వివేక్ నేతృత్వంలో చేను నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.