18 April, 2026 | 11:14 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

13-06-2025 01:27 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, జూన్ 12 : మహిళల ఆరోగ్యానికి ప్రత్యేకంగా థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్ దగ్గర నిర్మిస్తున్న ఉమెన్ థీమ్ పార్కులో జరుగుతున్న పను లను గురువారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా ఉమెన్ థీమ్ పార్కు ఏర్పాటు చేసిందన్నారు.

థీమ్ పార్కు అభివృద్ధి పనులకు దాదాపు కొన్ని లక్షల రూపాయల నిధులు మంజూరు చేశానన్నారు. త్వరగా పార్కు అభివృద్ధి పనులను పూర్తిచేసి మహిళలకు అందుబాటులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు రమేశ్ బాబు, దామోదర్, బీఆర్‌ఎస్ నాయకులు మధుసాగర్, గండికోట శ్రీనాధ్ తదితరులుపాల్గొన్నారు