14-01-2026 01:31:07 PM
ఢిల్లీలో కాళ్లు పట్టుకొని ఇక్కడ తొడలు కొడుతున్నాడు...
శామీర్ పేట్: మల్లారెడ్డి నువ్వు ఢిల్లీలో కాళ్లు పట్టుకొని ఇక్కడ తొడలు కొడుతున్నావా నువ్వు నీ చెంచగాళ్లతో ఏం ఒరిగేది లేదు అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అలియాబాద్ - మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఎన్ని సన్నాహాక సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. దీనికి దీటుగా మంగళవారం షామీర్పేట ప్రెస్ క్లబ్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.... ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం కాళ్లు పట్టుకొని ఇక్కడ వచ్చి తొడలు కొడుతున్నావ్ మల్లారెడ్డి నీది ఒక బతుకేనా బడుగు బలహీన వర్గాల భూములను కబ్జా చేశావ్ మల్లారెడ్డి అంటేనే మేడ్చల్ ప్రజలకు ఒక చిల్లర మనిషి అని మాజీ సీఎం కేసీఆర్ దత్తత మండలమైన మూడు చింతలపల్లి ని 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు.
మల్లారెడ్డి కి మతి పోయిందని సోయి లేకుండా మాట్లాడుతున్నాడని నీవు నీ చెంచా గాళ్లతో ఒరిగేది ఏమీ లేదన్నారు. మీరు 10 సంవత్సరాలలో చేయని అభివృద్ధి మేము ఇప్పుడు చేస్తున్నామని అది ఓర్వలేకే మాపై దుమ్మెత్తిపోస్తున్నావని ఖబర్దార్ మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరించారు. నీకు దమ్ముంటే మేడ్చల్ నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే నీకు ఈ జీవితమే లేదు నీ విద్యాసంస్థలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేఅనుమతులు ఇచ్చిందన్నారు. అది గుర్తుపెట్టుకో ఇప్పటికైనా బ్రోకర్ మాటలు మానుకో నువ్వు కేవలం బి ఫారం అమ్ముకోవడానికి సమావేశాలు నిర్వహిస్తున్నావు అన్నారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా అన్ని సీట్లు మేమే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తునికి రమేష్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, మూడు చింతలపల్లి మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపిటిసి అఖిలేష్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.