16 March, 2026 | 11:44 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

14-01-2026 01:33 PM

పలువురికి ఆర్థిక సాయం అందజేత

అర్మేనియాలో మృతి చెందిన మేకల ప్రవీణ్ మృతదేహం __స్వగ్రామానికి రప్పించేందుకు 

బరోసా ఇచ్చిన ఎమ్మెల్యే 

బోయినపల్లి:(విజయక్రాంతి): బోయినపల్లి మండలంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్ గత నాలుగు రోజుల క్రితం ఆర్మీనియా దేశంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి  ఆర్థిక సాయం అందజేసి మృతదేహాన్ని త్వరగ స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే మండల కేంద్రం చెందిన బొడ్డు పరశురాములు గత వారం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా  వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంని అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రత్నంపేటలో గ్రామపంచాయతీలో విధులు నిర్వహించిన పంచాయితీ కార్మికుడు ఎదురుగట్ల మల్లయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.దేశాయిపల్లి కి చెందిన మాడిశెట్టి రాయమల్లు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మధుగంటి సురేందర్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసి వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి,సర్పంచులు నల్లమోహన్, బీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, కౌడ గాని వెంకటేష్, జంగం అంజయ్య, సుద్దాల మధు,నాయకులు కొలువుల ప్రవీణ్,సంబ లక్ష్మీ రాజం, మెరుపుల జలంధర్, అనంతుల ఆంజనేయులు, నక్క శ్రీకాంత్,తదితరులు ఉన్నారు.