calender_icon.png 14 January, 2026 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరి మృతి

14-01-2026 01:27:51 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు తన భార్య సుగుణ కొడుకు దుర్గాప్రసాద్ హైదరాబాద్లో జీవిస్తూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉండేవారని తెలిపారు.

గత రెండు నెలలుగా మృతుడు సాయిలు గ్రామంలో ఉంటూ వ్యవసాయపనులు చూసుకుంటున్నాడని తెలిపారు.ప్రతిరోజు తన కుమారుడికి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు అన్నారు.గత ఐదు రోజులుగా ఫోన్ రాకపోవడంతో గ్రామానికి రాగా గ్రామ శివారులోని లింగోశపల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు మృతుని కుమారుడు ఫిర్యాదుల పేర్కొన్నారని ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.