5 May, 2026 | 3:18 AM

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

05-05-2026 01:58 AM

కరీంనగర్ క్రైం, మే 4 (విజయక్రాంతి): నగరంలోని పి.ఎం.జె, జువెల్లరీ షాపులో దోపిడీ జరిగిన ప్రాంతాన్నిపి.ఎం. జె, జూవేల్లెరి షాపులోని ఘటన స్థలాన్ని పరిశీలిం చి,బాధితులను పరామర్శించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్అధ్యక్షులు డా.మేడిపల్లి సత్యం, రాష్ట్ర కాంగ్రె స్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ లు పరిశీ లించారు.

సిబ్బందిని, పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హా స్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుల ను పరామర్శించి ధైర్యం చెప్పారు, బాధితులకు సరైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిఎంజే జ్యువెలరీ షాపులో దుండగులు జరిపిన కాల్పుల్లో జువెల్లరీ సి బ్బంది గాయపడటం దురదృష్టకరం, ఆరో గ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు.

అవసరమై తే మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు నగరానికి తరలిస్తామని, దొంగలను ఎదిరించి పోరాడిన సిబ్బందికి మనోధైర్యం ఇవ్వడం పోయి బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డిలు దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ మాట్లాడుతున్నారని మండి పడ్డారు. పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని, దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు, ప్రతిపక్షాలు దొంగలను పట్టించడానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం పోయి వ్యంగంగా మాట్లాడుతున్నారు.

ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి డ్రక్స్ కల్చర్, పబ్బు కల్చర్, గంజాయి లాంటి వాటిపై ఈగల్ ను తీసుకువచ్చి ఉక్కు పాదం మోపారన్నారని వివరించారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో వామన్ రావు దంపతులను నడిరోడ్డుపై చంపిన దిక్కులేదు, దిశాలాంటి ఎన్నో కేసులు జరిగినాయి. పి.ఎం. జె, సంఘటన కేసులో పోలీసులకు సమాచారం వచ్చిన 5 నుండి 10 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకొని వెంటనే సి.సి ఫుటేజ్ చూసి తగిన చర్యలు చేపడుతూ, పలు పోలీసు బృందాలను నలుదిక్కుల పంపడం జరిగిందని అన్నారు.