18 May, 2026 | 3:29 AM

నేటి ప్రజావాణి రద్దు

18-05-2026 02:32 AM

ములుగు టౌన్, మే 17 (విజయక్రాంతి): ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని తెలియజేప్పే మాక్ ఎక్స్సజ్ (డ్రిల్ )ను నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం నిర్వహిస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా ములుగు కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.