21-11-2025 02:20:42 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ మిగులు తెలంగాణ రాష్ట్రాలన్ని దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను కేటీఆర్ బెదిరిస్తున్నారని చామల వెల్లడించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కేటీఆర్ ఎక్కెక్కి ఏడుస్తున్నారు.. బీఆర్ఎస్ కు పదేళ్ల అధికారమిస్తే ఏం చేశారు? అని ఎంపీ చామల ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఏం జరగకూడదని కేటీఆర్ కోరుకుంటున్నారని కిరణ్ కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రిఫరెండం అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ భూటకపు మాటలను ప్రజలు నమ్మలేదని కాంగ్రెస్ ఎంపీ స్పష్టం చేశారు.