calender_icon.png 21 November, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సంక్షమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం

21-11-2025 02:27:37 PM

హైదరాబాద్: ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం(World Fisheries Day) సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్న గంగపుత్రులకు , బెస్తలకు, గుండ్లకు, ముదిరాజ్ లకు మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముఖగ నిలుస్తున్న మత్స్యకారుల సంక్షమానికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించే చేప పిల్లల పంపిణీ, చేప పిల్లల ద్వారా వ్యావహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి వృత్తిపై ఆధారపడ్డ మీ  అందరికీ ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అన్నారు. మీ అందరికీ మంచి జరగాలని, ఆర్థికంగా వృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని మంత్రి పొన్నం తెలిపారు.