calender_icon.png 19 January, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో కనుమరుగు దశకు కాంగ్రెస్

19-01-2026 01:56:16 AM

త్వరలోనే జాతీయ హోదాను కోల్పోతుంది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతూ దేశ రాజకీయాల్లో క్రమంగా కనుమరుగయ్యే దశకు చేరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్‌రావు పేర్కొన్నారు. జాతీయ పార్టీ హోదా కోల్పోయిన సీపీఐ మహాసభల్లో పాల్గొని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుసుకోవాల్సిన అసలు విషయ మేంటంటే.. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ హోదాను కోల్పోయే పరిస్థితులు దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని, ఇది ఆయన రాజకీయ అపరిపక్వతకు, పాల నా బాధ్యతల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి స్పష్టమైన నిదర్శనమని ఆదివారం ఆయన ప్రక టనను విడుదల చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దండు కడతామని, బీజేపీ ప్రభుత్వాన్ని కూ లదోస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని, కానీ ఆ కలలు నేడు ప్రజల తీర్పు తో నీటమునిగాయన్నారు. ముఖ్యమంత్రిగా కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి మీ రాజకీ య అసమర్థత కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డీకే అరుణకు ---మోదీ నాయకత్వం, ఆశీర్వాదం, బీజేపీ కార్యకర్తల కృషితో ఘన విజయం సాధించిన విషయం సీఎం మరిచిపోయారన్నారు.

సర్పంచ్ ఎన్నికలను ప్రధానమంత్రితో ము డిపెట్టిన రేవంత్‌రెడ్డి -లోక్‌సభ ఎన్నికలను తక్కువ చేసి మాట్లాడటం ఆయన రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అన్నారు. అదానీ, అంబానీ పేర్లు పదేపదే ప్రస్తావించే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి.... తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అంబానీతో కూ ర్చుని చర్చలు జరిపిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అని నిలదీశారు. కాం గ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి దేశం అవినీతి కుంభకోణాలతో కుదేలైన చరిత్రను కలిగి ఉందని, 2జీ స్కామ్, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్‌లు కాంగ్రెస్ పాలనకు గుర్తింపుగా నిలిచాయని, మోదీ నాయకత్వంలో దేశం అవినీతిరహిత, పారదర్శకమైన, బాధ్యతాయుత పాలన అంది స్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతికూల, అభివద్ధి వ్యతిరేక రాజకీయ ధోరణిని దేశ ప్రజలంతా స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు.