19-01-2026 01:54:58 AM
సీపీఐ, కాంగ్రెసుతోనే మేలు!
ఖమ్మం, జనవరి 18 (విజయక్రాంతి): ప్రధాని మోదీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు తిప్పి కొట్టాలని, బ్రిటిష్‌వారి కంటే బీజేపీ ప్రమాదకరమని, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు అందరం ఏకమవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ, కాం గ్రెస్‌లతోనే ప్రజలకు మేలని, ఈ రెండు పార్టీలు చేసిన పోరాటాల వల్లే భారత ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చాయని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో ఆదివా రం నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
140, 100 ఏళ్ల చరిత్ర గలిగిన కాంగ్రెస్, సీపీఐల పోరాటాల వల్లనే అనేక హక్కులు సాధించగలిగామని తెలిపారు. బ్రిటిష్ ఉద్యమంలో రెండు పా ర్టీల పోరాటాలతోనే స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. వచ్చిన స్వాతం త్య్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక విధానాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి హక్కులను కాల రాస్తున్నారని మండిపడ్డారు.
దున్నేవాడిదే భూమి అనే నినాదంతోనే ఇంది రాగాంధీ జమీందారుల నుంచి వేల ఎకరాలను ప్రభుత్వ పరం చేసి పేదలకు పంచిపె ట్టారని గుర్తు చేశారు. రైతు పండించిన ధరలను గిట్టుబాటు రావటం లేదని కమ్యూని స్టులు చేసిన పోరాటాలతోనే కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలను శాసనం తీసుకొచ్చి దళారి వ్యవస్థను అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు. బీజేపీకి ఖమ్మం జిల్లాలో స్థానం లేదు.. అందుకే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అమెరికాను ప్రశ్నించలేని మోదీ: డి రాజా
పాసిస్టు శక్తులను ఎదుర్కొనేందుకు లౌకి క శక్తులు ఏకం కావాలని, చరిత్ర లేని వారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా ఆరోపించారు. వందేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అత్యంత కీలక ఘట్టమని ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బజిఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభా స్థలి కిటకిటలాడింది. తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కూనంనేని సాం బశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో రాజా మాట్లాడుతూ.. వందేళ్లు త్యాగాలతోనే గడిచిపోయిందని అనేక మంది తమ త్యాగాలతో ఈ నేలను పునితం చేశారన్నారు.
దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మాత్రమే ఒక రాజకీయ చరిత్ర ఉందని వందేళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు అసలు చరిత్ర లేదన్నారు. దేశ స్వాతంత్య్రంలోనూ ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర ఏమిటని రాజా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే సిపిఐ సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నాడని మరో హిట్లర్ కావాలనుకుం టున్నాడని ట్రంప్ను ఎర్ర జెండాలు ఎదుర్కొంటాయని రాజా స్పష్టం చేశారు.
రష్యా, ఉక్రేన్ యుద్ధాన్ని సాకుగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న ట్రంప్‌ను ప్రశ్నించే శక్తి భారత ప్రధాని మోదీకి లేదన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందని దీనిని నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిడి తీసుకు రావడం శోచనీ యమన్నారు. ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ద్విరాష్ట్ర పరిష్కారానికి సిపిఐ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రతిభింభిస్తూ జరిగిన భారీ బహిరంగ సభ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్జిత్ కౌర్, గిరిశర్మ, అనిరాజా, ప్రకాష్ బాబు, సందోష్ బాబు, పల్లా వెంకటరెడ్డి, బినయ్ విశ్వం, రామకృష్ణ పాండా, కె. రామకృష్ణ, కుల్దేవ్, జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శులు తకెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నర్సింహ, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఎస్కో సాబీర్ పాషా, వనజా, నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎంఎల్సి ఎన్. సత్యం, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.